సిసోడియా కస్టడీ పొడిగింపు

Extension of custody of Sisodia

May 30, 2024 - 13:55
 0
సిసోడియా కస్టడీ పొడిగింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మద్యం కుంభకోణంలో అరెస్ట్​ అయిన ఆప్​ నాయకుడు మనీష్​ సిసోడియా జ్యూడీషియల్​ రిమాండ్​ ను కోర్టు పొడిగించింది. దీంతో బెయిల్​ లభిస్తుందనుకున్న ఆయన ఆశలు అడియాశలే అయ్యాయి. గురువారం రౌస్​ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో మనీష్​ సిసోడియా వీడియో మాధ్యమంగా ద్వారా హాజరయ్యారు. వాదనలు, ప్రతివాదనలు జరిగాయి. అనంతరం జూలై 6 వరకు సిసోడియా జ్యూడీషియల్​ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం వెలువరించింది. తన భార్య అనారోగ్యం కారణంగా తనకు బెయిల్​ ఇవ్వాలని సిసోడియా కోర్టుకు విన్నవించారు. గతంలో పలుమార్లు కోర్టు ఒకరోజు బెయిల్​ ను కూడా కేటాయించిన విషయం తెలిసిందే.