బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు 8మంది మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని విరుద్ద్ నగర్​ లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 8మంది మృతి చెందారు.

Feb 17, 2024 - 15:23
 0
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు 8మంది మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

తమిళనాడు: తమిళనాడులోని విరుద్ద్ నగర్​ లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 8మంది మృతి చెందారు. శనివారం ఉదయం ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడులో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. పేలుడు విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి ఫ్యాక్టీరీ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు కారణాలు తెలియరాలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు