తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్యకు వైద్యుల బృందం

అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Feb 17, 2024 - 15:04
 0
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్యకు వైద్యుల బృందం

నా తెలంగాణ, హైదరాబాద్: అయోధ్యలో మెడికల్ క్యాంపులో పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో  డాక్టర్ ల బృందం సిద్ధమైంది. ఈ సందర్బంగా ఐదుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందం శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని  కలిశారు.  వారిని కిషన్ రెడ్డి అభినందించారు. వైద్యుల బృందంలో డాక్టర్ ప్రదీప్ కండ్లికర్ (అనస్తేటిస్ట్ 9849034908), డాక్టర్ రష్మీ కండ్లీకర్ (డెంటల్ సర్జన్ 9848021784), డాక్టర్ టి మోహిత్ (7995639866), డాక్టర్ నరేష్ బాబు (ఫిజిషియన్ 9866007200), 
డాక్టర్ సాయినాథ్ రెడ్డి మంద (ఆర్తోపెడిక్ సర్జన్ 9500151647) ఉన్నారు.