ప్రజలకు తనపై అభిమానం ఎక్కువ

మేలు తీర్చుకోలేనిది గాంధీనగర్​ స్థానానికి నామినేషన్​ దాఖలులో కేంద్రమంత్రి అమిత్​ షా

Apr 19, 2024 - 14:36
 0
ప్రజలకు తనపై అభిమానం ఎక్కువ

గాంధీనగర్​: గాంధీనగర్​ ప్రజలకు తనపై ప్రేమ, అభిమానం ఎక్కువని కేంద్రమంత్రి అమిత్​ షా అన్నారు. అందుకే అద్వానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నేతృత్వం వహించిన నియోజకవర్గం నుంచి తనను వరుసగా గెలిపిస్తున్నారని అన్నారు. ఇక్కడి ప్రజల మేలు తీర్చుకోలేనిదని అమిత్​ షా స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ నగర్​ నియోజకవర్గానికి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కలెక్టరేట్​ లో నామినేషన్​ దాఖలు చేశారు. నామినేషన్​ అనంతరం మాట్లాడారు. 

గాంధీనగర్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. గాంధీనగర్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని అందరం కలిసి ఎన్నుకుందామని పిలుపునిచ్చారు. మోదీ దేశ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. సూదూర లక్ష్యంగాతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఐదు లక్షల పై చిలుకు మెజార్టీతో అమిత్​ షా విజయం సాధించారు. ఈ సారి ఆయన గెలుపు తథ్యమే అయినా మెజార్టీపై ‘కాయ్​ రాజా కాయ్​’ (బెట్టింగ్​)లు కొనసాగుతుండడం విశేషం. కాగా గుజరాత్​ లోని 26 ఎంపీ స్థానాలకు మే 7న పోలింగ్​ నిర్వహించనున్నారు.