అవినీతి ఆరోపణలు.. ఇందిరాగాంధీ అరెస్టు
ప్రధాని మొరార్జీ దేశాయ్, హోంమంత్రి చౌదరీ చరణ్ సింగ్ ల ఆదేశాల మేరకే
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని అరెస్టు అయ్యిందన్న విషయం ఎందరికి తెలుసు? అయితే ఆమె అరెస్టును 24 రోజుల ప్రధాని చేయించాడన్న విషయం తెలుసా? ఇందిర ఎందుకు అరెస్టు అయ్యారు. ఎవరు అరెస్టు చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
అక్టోబర్ 1977లో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అధికారులు ఫైళ్లను హడావిడిగా తిరగేస్తున్నారు.ఇదే సమయంలో దేశంలోని పోలీసులందరికీ హై అలెర్ట్ సందేశాలు పంపారు. పెద్ద పరిణామం జరగబోతోందని పోలీసులు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అదే కేంద్రంలోని అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని చౌదరి చరణ్ సింగ్ హోంమంత్రిగా పనిచేశారు.
ఎమర్జెన్సీ సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం తప్పని పలువురు పేర్కొన్నారు. ఆ సమయంలో పలువురు జాతీయ నాయకులను కూడా ఇందిరాగాంధీ జైలుకు పంపారు. అయితే రాయ్ బరేలీ సీటుపై ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్ముతో వంద జీపులను ఇందిరాగాంధీ కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని హోంశాఖ మంతరి చౌదరీ చరణ్ సింగ్ ఈ విషయంపై అవినీతి విచారణకు అనుమతులు జారీ చేశారు. ఇందిరాగాంధీని ప్రభుత్వ సొమ్ముతో జీపులు కొనుగోలు చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
ఆమె అరెస్టుపై కూడా సందిగ్ధత నెలకొంది. అక్టోబర్ 1నే ఆమెను అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారు. చరణ్ సింగ్ భార్య గాయత్రి దేవి అక్టోబర్ 1 శనివారం అరెస్టు చేస్తే మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఆమెకు బెయిల్ రాదని ఊహించారు. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి ప్రజల్లో అరెస్టుపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో అక్టోబర్ 3న ఇందిరాగాంధీని అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్టోబర్ 3న ఇందిరాగాంధీని అరెస్టు చేశారు. అయితే ఇందిరాగాంధీకి 16 గంటల కస్టడీ అనంతరం బెయిల్ లభించింది.
అయితే చౌదరీ చరణ్ సింగ్ 28 జూలై 1979లో ప్రధాని అయ్యారు. కేవలం 24 రోజులు మాత్రమే ఒక్కరోజు కూడా లోక్ సభకు వెళ్లని ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు. కాంగ్రెస్ తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన ప్రధాని పదవీని వీడాల్సి వచ్చింది. అయితే తాత్కాలిక ప్రధానిగా ఆయన ఐదు నెలలపాటు కొనసాగారు. ఇందిరాగాంధీ తన అరెస్టుకు చరణ్ సింగ్ పై ఆ మాదిరి ప్రతీకారం తీర్చుకోగలిగింది.