వియత్నంతో ద్వైపాక్షిక బంధాలు బలోపేతం
ప్రధాని చిన్హ్ కు మోదీ ఘన స్వాగతం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో–పసిఫిక్ విజన్ కి వియత్నాంతో బంధాలు, ద్వైపాక్షిక చర్యలు కీలకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్హ్ భారత్ కు వచ్చిన సందర్భంగా మోదీ ఆయనకు స్వాగతం పలికారు. తొలుత చిన్హ్ రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ప్రధాని ఆహ్వానం మేరకు చిన్ భారత్ కు వచ్చారు. విదేశాంగ శాఖ, ప్రధానితో కలిసి చిన్హ్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతలను కలవనున్నారు.