సాంకేతికాభివృద్ది ప్రదాత రాజీవ్

Technology development provider Rajiv

Aug 20, 2024 - 17:35
 0
సాంకేతికాభివృద్ది ప్రదాత రాజీవ్

నా తెలంగాణ, నిర్మల్: భారత దేశంలో సాంకేతికాభివృద్ధికి మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు నివాసంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. 18 ఏండ్లకే యువకులకు ఓటు హక్కును కల్పించారని తెలిపారు. దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు ఎంబడి రాజేశ్వర్, మాజీ జడ్పిటీసి సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బార్ అసోసియేషన్  అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.