నాణ్యమైన ఆహారం అందించాలి

ప్లాస్టిక్​ వాడొద్దు మహిళా శక్తి క్యాంటీన్​ స్థలం, సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన  ఆకస్మిక పర్యటనలో కలెక్టర్​ రాజర్షి షా.. వసతులపై ఆరా

Aug 28, 2024 - 17:51
 0
నాణ్యమైన  ఆహారం అందించాలి
నా తెలంగాణ, ఆదిలాబాద్​: విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కస్తుర్భా గాంధీ పాఠశాల క్యాంటీన్​ నిర్వాహకులకు కలెక్టర్​ రాజర్షి షా ఆదేశించారు. క్యాంటీన్​ లో ప్లాస్టిక్​ కవర్లు, బాటిల్స్​ వాడొద్దన్నారు. బట్టతో చేసిన సంచులను ఉపయోగించాలన్నారు. అలాగే రేట్​ చార్ట్​ ను ఏర్పాటు చేయాలని సూచించారు. 
ఇచ్చోడ పాత బస్టాండ్​ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్​ ను బుధవారం కలెక్టర్​ రాజర్షి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్​ నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు జారీ చేశారు. బ్యాంకు ద్వారా రుణం అందిందన్నారు. నిధులకు సంబంధించి ఖర్చులను సరైన పద్దతిలో నిర్వహించాలన్నారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దన్నారు. బోథ్​ పొచ్చెర జలపాతం వద్ద మహిళా శక్తి క్యాంటీన్​ ఏర్పాటునకు స్థలాన్ని, నూతనంగా రూ. 63 లక్షలతో నిర్మిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో బోధన, అందుతున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను పరిశీలించారు. హెల్త్​ సెంటర్​ ను పరిశీలించిన కలెక్టర్​ రోగులతో, జ్వర పీడితులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఏ ప్రాంతాల్లో కూడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం సొంతమవుతుందని ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. కలెక్టర్​ రాజర్షి తోపాటు అడిషనల్​ కలెక్టర్ శ్యామలా దేవి, డీఆర్డీవో సాయన్న, సబ్ రిజిస్ట్రార్ సాయి వివేక్, ఈఈ టీజీఎంఎస్​ ఐడీసీ నర్సింహ రావు, తహసీల్దార్ సుభాష్ చందర్, ప్రిన్సిపల్ వలిత, తదితరులు పాల్గొన్నారు.