అపార అవకాశాల సృష్టే లక్ష్యం

The goal is to create immense opportunities

Dec 21, 2024 - 17:34
 0
అపార అవకాశాల సృష్టే లక్ష్యం

ఈశాన్య మండలి 72వ ప్లీనరీలో కేంద్రమంత్రి అమిత్​ షా

అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు సృష్టిస్తున్నామని, దీంతో ఈ ప్రాంతాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. శనివారం అగర్తలాలో జరిగిన ఈశాన్య మండలి 72వ ప్లీనరీ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాపార, వాణిజ్యాలకు కేంద్ర బిందువుగా మార్చాలనే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. గత పదేళ్లలో ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు ముఖ్యమైనవన్నారు. ఈ చర్యలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం, నమ్మకాలు పెరిగి ఈ ప్రాంతాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాల స్థాపనకు నాందీ వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం ఆ పరిస్థితుల్లో పూర్తి మార్పుతీసుకువస్తున్నామని తెలిపారు. శాంతి స్థాపన, అభివృద్ధి, విద్య, వైద్యం, తాగు, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన, మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, గిరిజనులు, ఆదివాసీలకు ప్రాధాన్యం, నిరుపేదల చెంతకే కేంద్ర పథకాల అందజేత లాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు చేకూరుస్తామని తెలిపారు. దేశంలోని అన్ని రాష్​ర్టాలు, ప్రాంతాలతో సహా ఈశాన్య ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధిని సాధించాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. 

తీవ్రవాదం, హింస తగ్గించామని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఈ ప్రాంత శాంతిని నెలకొల్పడంలో అహార్నిశలు పనిచేశారని కొనియాడారు. దీంతో తీవ్రవాద కార్యకలాపాలు 71 శాతం తగ్గాయన్నారు. 60 శాతం ప్రాణనష్టం తగ్గించగలిగామని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు.