ఇంగ్లీష్​ ఛానల్​ లో బోటు ప్రమాదం 8మంది మృతి

8 killed in boat accident in English Channel

Sep 15, 2024 - 15:44
 0
ఇంగ్లీష్​ ఛానల్​ లో బోటు ప్రమాదం 8మంది మృతి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యూరప్​ లో అక్రమంగా ప్రవేశించేందుకు ఫ్​రాన్స్​ నుంచి ఇంగ్లీష్​ ఛానల్​ సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నించిన ఒక బోటు మునిగిపోయింది. ఇందులో ఉన్నవారి సంఖ్య తెలియనప్పటికీ 8మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బోటులో ప్రయాణిస్తున్న వారి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టినట్లు ఫ్రెంచ్​ అధికారులు వివరించారు. ఈ బోటు ప్రమాదం ఆదివారం ఉదయం జరిగిందన్నారు. ఆ సమయంలో భారీగా అలలు ఎగిసిపడుతుండగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్​ ఛానల్​ దాటి అక్రమంగా ప్రవేశించడం ఇదే మొదటిసారి కాదు. ప్రమాదమని తెలిసినా అక్రమ వలసదారులు ఈ దారి గుండా యూరప్​ లోకి ప్రవేశించేందుకు యత్నిస్తుంటారు. చిన్నవైన పడవల్లో ఎక్కువమంది ప్రయాణించడం వల్ల బోటు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటాయని అధికారులు వివరించారు. కాగా ఈ ప్రమాదం నుంచి కొందరిని క్షేమంగా కాపాడమన్నారు. వారిని అంబుల్టీయూస్​ కు తీసుకువెళ్లామని తెలిపారు.