సైబర్ నేరాలకు పాల్పడిన జంట అరెస్ట్

Couple arrested for cyber crimes

Oct 24, 2024 - 21:03
 0
సైబర్ నేరాలకు పాల్పడిన జంట అరెస్ట్

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సులువుగా డబ్బులు సంపాదించాలని అక్రమ మార్గంలో యువకులకు వల వేస్తూ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఓ జంటను మందమర్రి పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సీఐ శశిధర్ రెడ్డి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. జమ్మికుంట మండలానికి బొద్దిరెడ్డి మౌనిక, శనిగారపు మధుకర్ సహజీవనం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మౌనిక మందమర్రికి చెందిన యువకున్ని చరవాణి ద్వారా ఫోన్ లో పరిచయం చేసుకొని ఆర్థికంగా అవసరం ఉందని రూ.85 వేల మొత్తాన్ని తీసుకుంది. యువకుడు మహిళను తిరిగి డబ్బులు అడుగగా మహిళ ప్రియుడు శనిగారపు మధుకర్ యువకుని ఫోన్ చేసి భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు  చేశాడని సీఐ తెలిపారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సై రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అజయ్, రాము, మహిళా హోంగార్డ్ ఉమ ఉన్నారు.