ప్రజాస్వామ్య మూలాలు పటిష్ఠం

democratic roots patishtha

Dec 17, 2024 - 19:26
 0
ప్రజాస్వామ్య మూలాలు పటిష్ఠం

అహాంకారాన్ని బద్ధలు కొట్టాయి
కేంద్రమంత్రి అమిత్​ షా
ఆర్థికంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు
వివేకానంద, అరబిందోల ఆశలు నిజం చేసే సమయం ఆసన్నం
సర్దార్​ పటేల్​ వల్లే ఐక్యతగా ఉన్నాం
గొప్ప కళాకారుడు నంద్​ లాల్​ బోధ్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య మూలాలు పటిష్ఠంగా ఉన్నాయని, ఇవి ఎందరో నియంతల అహాంకారాన్ని బద్ధలు కొట్టాయని అన్నారు. జమిలి బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం కేంద్రమంత్రి అమిత్​ షా మాట్లాడారు. నియంతల అహంకారాన్ని భారత ప్రజాస్వామ్యం అనేకసార్లు బద్దలు కొట్టిందన్నారు. భారత్​ ఆర్థిక పటిష్​ఠత్వాన్ని సాధించదనుకునే వారు నేడు ప్రపంచదేశాల్లో ఐదో దేశంగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో త్వరలో మూడోస్థానానికి కూడా భారత్​ ఆర్థిక వ్యవస్థను తీసుకువెళతామన్నారు. ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఉభయసభల్లోనూ రాజ్యాంగంపై అనేకసార్లు చర్చ జరిగిందన్నారు. దేశ ప్రజలు, యువతకు బంగారు భవిష్యత్​ ఉన్న భారత్​ ను అందించనున్నామన్నారు. దేశభవిష్యత్​, ప్రజాభిప్రాయం, శ్రేయస్సు అంటే కేవలం సభలో కూర్చొని నిర్ణయించేది కాదన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నారు. 

స్వామి వివేకానంద, అరబిందో లాంటి వారి ఆశలు, అంచనాలు నిజం చేసే సమయం ఆస్నమైందని కేంద్రమంత్రి అమిత్​ షా అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచదేశాల్లో ప్రత్యేకత సంతరించుకుంటుందన్నారు. అత్యంత వివరణాత్మక, లిఖిత పూర్వకమైన రాజ్యాంగం భారత్​ దే అని మంత్రి స్పష్టం చేశారు. 

రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు 22 కులాలు, మతాలకు చెందినవారన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే భారత రాజ్యాంగం రూపొందిందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశం విచ్ఛిన్నమవుతుందని, దేశంలో ఐక్యత ఉండదని చాలా మంది అంచనా వేశారు. కానీ దేశం ఆర్థికంగా ఎవ్వరిపై ఆధారపడకూడదని నిర్ణయించిందన్నారు. సర్దార్ పటేల్ వల్లే దేశం ఐక్యంగా ఉందన్నారు.

రాజ్యాంగాన్ని చిత్రాల రూపంలో మలిచిన గొప్ప కళాకారుడు నంద్​ లాల్​ బోధ్​​ అన్నారు. నాలుగేళ్లపాటు శ్రమించి చిత్రాలను రూపొందించారని చెప్పారు. గురుగోవింద్​ సింగ్​, రాముడు, బుధుడు, భగవద్గీతసందేశం, శివాఈ, రాణి లక్ష్మీబాయి, నలం, నటరాజ వంటి చిత్రాలు రాజ్యాంగ పుస్తకంలో భారతదేశ సమతూల్యతు తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి అమిత్​ షా హర్షం వ్యక్త చేశారు.