బంగ్లా మహిళలపై పాక్ సైనికుల లైంగికదాడి!

400మంది మృతదేహాలు 

Dec 16, 2024 - 17:22
 0
బంగ్లా మహిళలపై పాక్ సైనికుల లైంగికదాడి!

మీడియాతో 1971 యుద్ధ పరిస్థితులను పంచుకున్న మాజీ ఆర్మీ జనరల్​ వీకే సింగ్​

రాయ్​ పూర్​: బంగ్లాదేశ్​ లో 1971 యుద్ధ పరిస్థితుల సమయంలో 400మంది మహిళలపై పాక్​ సైన్యం లైంగిక దాడికి పాల్పడిందని ఆర్మీ మాజీ చీఫ్​ జనరల్​ వీకే సింగ్​ అన్నారు. చత్తీస్​ గఢ్​ లోని రాయ్​ పూర్​ లో సోమవారం జరిగిన ఓ ఈవెంట్​ లో పాల్గొని మీడియాతో మాట్లాడారు.  తాను ఆ సమయంలో ఇంటలిజెన్స్​ అధికారిగా విధులు నిర్వహించానని తెలిపారు. 1971 డిసెంబర్​ 16న పాక్​ ను తరిమి కొట్టి బంగ్లాదేశ్​ కు స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చామన్నారు. చిట్టగాంగ్​ లో తన బృందంతో కలిసి మెడికల్​ కాలేజీకి వెళ్లానని తెలిపారు. అక్కడ మహిళలపై పాక్​ సైనికులు లైంగిక దాడులకు పాల్పడేవారని అన్నారు. తమ బృందం ఎంతోమందిని కాపాడిందన్నారు. పాక్​ సైన్యం ఆగడాలు శృతి మించడంతో ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వాపోయారు. ఎంతోమంది మహిళల అర్థనగ్న మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయన్నారు. అందులో గర్భిణీ స్ర్తీలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో మహిళలపై జరిగిన ఆకృత్యాలను ఏ ఒక్కరూ ఖండించలేదన్నారు. అప్పట్లో బంగ్లాకు సహాయం చేస్తున్నందుకు చైనా, అమెరికాలు కూడా భారత్​ కు వ్యతిరేకంగానే ఉన్నాయన్నారు. ఆ రెండు దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతానికి వచ్చి భారత్​ వ్యతిరేకతతో తిరిగి వెళ్లాయన్నారు. ఆ యుద్ధంలో ఎంతమంది అసువులు బాసారనేది లెక్కనేలేదన్నారు. అంతగా పాక్​ సైనికులు బంగ్లాలో అరాచకాలను సృష్టించారని మాజీ జనరల్​ వీకే సింగ్​ మీడియాకు వివరించారు.