నమస్తేతో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం భద్రం
Namaste, keep the health of sanitation workers safe!
కేంద్రమంత్రి రాంధాస్ అథవాలే
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పారిశుద్ధ్య కార్మికుల భద్రత గౌరవం, సామాజిక ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం (నమస్తే) నేషనల్ యాక్షన్ ర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పథకాన్ని ప్రారంభించిందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రాంధాస్ అథవాలే అన్నారు. లోక్ సభలో మంగళవారం మంత్రి మాట్లాడారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 57,758 మంది మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులను గుర్తించామన్నారు. 54,574 మంది కార్మికులను ధృవీకరించామన్నారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 2023–24 లో ప్రారంభించామన్నారు. ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులు 67.91 శాతం ఎస్సీ కులాల నుంచి వస్తున్నారని, ఇతర వెనుకబడిన వర్గాల నుంచి 15.73 శాతం మంది, ఓబీసీ నుంచి 8.31 శాతం, ఎస్టీ నుంచి 8.05 శాతం విధులు నిర్వహిస్తున్నారని గుర్తించినట్లు తెలిపారు. కార్మికుల భద్రతను మెరుగుపరిచేందుకు 16,791మందికి వ్యక్తిగత రక్షణ కిట్ లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ శానిటేషన్ యూనిట్ల కసం 43 భద్రతా పరికరాల కిట్ లు పంపిణీ చేశామన్నారు. ఆయుష్మాన్ కార్డుల ద్వారా 13,604 కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు విస్తరించామన్నారు. 503 మంది పారిశుద్ధ్య కార్మికుల కసం 13.96 కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం 226 కార్మికులకు 2.85 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. కార్మికుల భద్రత కోసం శిక్షణ ఇచ్చేందుకు 837 వర్క్ షాప్ లు నిర్వహించామన్నారు. అసురక్షిత మాన్యువల్ క్లీనింగ్ పద్ధతులను నిర్మూలించేందుకు ప్రభుత్వం పూర్తి యాంత్రీకరణపై దృష్టి సారించాన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద 26 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2,585 డెస్లడ్జింగ్ వాహనాలను కొనుగోలు చేసేందుకు రూ. 371 కోట్లు కేటాయించామన్నారు. దీంతో కార్మికుల ఆరోగ్య ప్రమాణాల్లో పెంపుదల చోటు చేసుకుంటుందని కేంద్రమంత్రి అథవాలే స్పష్టం చేశారు.