అన్నంలో పురుగులు భోరుమన్న విద్యార్థినిలు

అసెంబ్లీలో సమస్యలపై గళం పాలమాకుల కస్తుర్భా పాఠశాలను సందర్శించిన హరీష్​ రావు, సబితా ఇంద్రారెడ్డి

Aug 31, 2024 - 17:26
 0
అన్నంలో పురుగులు భోరుమన్న విద్యార్థినిలు

నా తెలంగాణ, శంషాబాద్​: పురుగులు వస్తున్నాయంటే బెదిరిస్తున్నారు,కొడుతున్నారంటూ విద్యార్థినీలు బీఆర్​ ఎస్​ నాయకుడు హరీష్​ రావు, సబితా ఇంద్రారెడ్డిలకు మొరపెట్టుకున్నారు. శనివారం విద్యాలయాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు సమస్యలను ఏకరవు పెట్టుకొని భోరుమన్నారు. ఉపాధ్యాయులు నాణ్యమైన భోజనం చేస్తున్నారని, ఐదు లీటర్ల పాలతో రోజంతా నాణ్యమైన టీ తాగుతారని అన్నారు. తమకూ నాణ్యమైన భోజనం పెట్టాలంటే కళ్లలో, వీపుపై కారం కొడుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. 12 గంటలకు వచ్చి సమయం కాకమునుపే వెళ్లిపోతారన్నారు. అసౌకర్యాలకు నిలయంగా గురుకుల పాఠశాల మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గురుకులల, పాఠశాలలు నిర్వీర్యం..
విద్యార్థినిల సమస్యలు విన్న హరీష్​ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ర్టంలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఓ చోట నాణ్యతలేని ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆరోపించారు. కనీస సౌకర్యాలను కూడా కల్పించలేక రేవంత్​ రెడ్డి ప్రభుత్వం చతికిలపడిందన్నారు. హాస్టళ్లలో విద్యార్థులను ఎలుకలు, పాములు కుడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం విచారకరమన్నారు. రాష్​ర్టంలో ఇప్పటివరకు 38 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. బీఆర్​ ఎస్​ హయాంలో తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని అన్నారు. కులం పేరుతో దూషిస్తున్నారని, తల్లిదండ్రులకు గతి లేక పిల్లలను స్కూళ్లలో చేరుస్తున్నారని ఉపాధ్యాయులు వేధిస్తున్నారని విద్యార్థినిలు మొరపెట్టుకున్నారని తెలిపారు. ఈ గురుకులంలోని ఉపాధ్యాయులందరినీ మార్చాలని వెంటనే విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని హరీష్​ రావు డిమాండ్​ చేశారు.