పెరిగిన అటవీ విస్తీర్ణం

Increased forest cover

Dec 21, 2024 - 17:19
 0
పెరిగిన అటవీ విస్తీర్ణం

ఐఎఎఫ్​ ఆర్​ నివేదికను వెల్లడించిన కేంద్రమంత్రి భూపేందర్​ యాదవ్​

డెహ్రాడూన్​: భారత్​ లో అటవీ విస్తీర్ణ శాతం 1,445 కి.మీ. మేర పెరిగిందని అటవీ పరిశోధనా సంస్థ ఐఎస్​ ఎఫ్​ ఆర్​ (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్) –2023ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం తెలిపారు. ఐఎస్​ ఎఫ్​ ఆర్​ వెల్లడించిన నివేదికను విడుదల చేశారు. దేశంలోని అటవీ విస్తీర్ణం చెట్ల విస్తీర్ణం, కార్బన్​ నిల్వలు, అడవుల్లో జరిగిన ప్రమాదాలు, అగ్రో ఫారెస్ర్టీ పాత్రపై ఐఎస్​ ఎఫ్​ ఆర్​ పరిశోధన చేసి నివేదికను విడుదల చేస్తుంది. భారతదేశంలో మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం 827,357 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది దేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో 25.17 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులో 715,343 చదరపు కిలోమీటర్లు (21.76శాతం) అటవీ ప్రాంతంగా వర్గీకరించారు. 112,014 చదరపు కిలోమీటర్లు (3.41శాతం) చెట్లతో నిండి ఉంది. నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం 156 చ.కి.మీటర్లు, చెట్ల విస్తీర్ణం 1,289 చ.కి.మీటర్లు పెరిగిందని యాదవ్​ సంతోషం వ్యక్తం చేశారు. భారత్​ అడవులలో కార్బన్​ నిల్వలు ప్రస్తుతం అంచనా ప్రకారం 7, 285.5 మిలియన్​ టన్నులుగా ఉంది. గత అంచనా కంటే 81.5 మిలియన్​ టన్నులు పెరిగింది.