స్మైల్ భారత్–ఏడీబీల మధ్య ఒప్పందం ఖరారు
The agreement between Smile Bharat and ADB has been finalized
350 మిలియన్ డాలర్ల పాలసీతో అభివృద్ధి పనులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ మల్టీమోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ (స్మైల్) పథకానికి మద్దతుగా భారత ప్రభుత్వం, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 350 మిలియన్ డాలర్ల పాలసీ -ఆధారిత రుణ ఒప్పందంపై శనివారం సంతకాలు చేశాయి. తయారీ సామర్థ్యాలను మెరుగుపర్చడం, స్థితిస్థాపక సరఫరాను పెంపొందించడం, లాజిస్టిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను పటిష్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. లాజిస్టిక్ రంగంలో తయారీ, పోటీతత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ ఒప్పందం ద్వారా మౌలిక సదుపాయాల కల్ప, సాంకేతిక, వాణిజ్య సామర్థ్యాలు, సమ్మిళిత వృద్ధి సాధన, ఉద్యోగవకాశాలను సృష్టించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహారాష్ర్టలో తీర ప్రాంత రక్షణకు 42 మిలియన్ డాలర్ల రుణానికి ఏడీబీ ఓకే చెప్పింది. దీంతో పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారులకు జీవోపాధినికి మరింత మెరుగుపర్చనున్నారు.