కువైట్​ కు ప్రధాని మోదీ

Prime Minister Modi to Kuwait

Dec 21, 2024 - 15:04
 0
కువైట్​ కు ప్రధాని మోదీ

అల్ అసిమా గవర్నేట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్​ చేరుకున్నారు. శనివారం ఉదయం రెండు రోజుల పర్యటనకు బయలుదేరి మధ్యాహ్నానికి కువైట్​ రాజధాని అల్​ అసిమా గవర్నేట్​ విమానాశ్రయంలో దిగారు. ప్రధాని మోదీకి ఆ దేశ ఎమిర్​ షేక్​ మిషాల్​ అల్​ అహ్మద్​ అల్​ జాబేర్​ అల్​ సబా ఘనంగా స్వాగతం పలికారు. పలువురు మంత్రులు కూడా మోదీకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. భారత్​ – కువైట్​ మధ్య దౌత్యబంధాలు మరింత బలోపేతం దిశగా ప్రధాని చర్యలు తీసుకోనున్నారు. 43యేళ్ల తరువాత కువైట్​ లో పర్యటించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. కువైట్​ లో పది లక్షల మంది భారతీయులున్నారు. క్రూడాయిల్​ దిగుమతుల్లో భారత్​ కు ఆరో అతిపెద్ద దిగుమతిదారుగా కువైట్​ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి అరబ్​ దేశాల్లో 14 పర్యటనలు చేశారు. ఒమన్​–1, సౌదీ అరేబియా–2, బహ్రెయిన్​–1, యూఏఈ–7, ఖతర్​–2, కువైట్​–1. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధానమంత్రి ఇరుదేశాల బంధాలు, దౌత్య సంబంధాలతోపాటు భారతీయ సమాజాన్ని కలిసి వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.