హిమాచల్ లో వర్ష బీభత్సం
72 రోడ్లు మూసివేత రూ. 1265 కోట్లు నష్టం దేశ వ్యాప్తంగా ఐఎండీ అలర్ట్ జారీ
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల వల్ల రాష్ర్ట వ్యాప్తంగా 72 రహదారులను మూసివేశారు. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రూ. 1265 కోట్ల నష్టం వాటిల్లినట్లు శనివారం అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. సిమ్లా, మండి, కులు, ఉనా, సిర్మౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో రహదారులు మూతపడ్డాయన్నారు. ఋతుపవనాలు వచ్చినప్పటి నుంచి 150 మంది మృతిచెందారన్నారు. సుందర్ నగర్, శిలారు, జుబ్బరహట్టి, మనాలి, సిమ్లా, స్లాపర్, డల్హౌసీలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
మరోవైపు గుజరాత్ లో అస్నా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కర్ణాటక సముద్ర తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈశాన్య ప్రాంతాల్లో ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. ఒడిశాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. యూపీ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.