సింగూరుకు జలకళ 

Water art for Singur

Sep 4, 2024 - 16:22
 0
సింగూరుకు జలకళ 

ప్రస్తుత నీటిమట్టం 23.950
43,028 క్యూసెక్కుల ఇన్ ప్లో 
సందర్శకులను అనుమతించని అధికారులు 

నా తెలంగాణ, సంగారెడ్డి: గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు డ్యామ్ కు భారీగా వరద నీటి ఉధృతి కొనసాగుతుంది. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ హైదరాబాద్ డివిజన్​ లో గల మంజీరా నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి నీరు భారీగా చేరుతోంది. చింగురు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 523.600 మీటర్లు 29.917 టీఎంసీలు కాగా 23.950 టిఎంసీలు ఇన్ ప్లో నమోదవగా, ఔట్ ప్లో 401 క్యూసెక్కులు  నమోదయిందని సింగూరు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం అధికమవడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులను ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. 

మంజీరాకు కొనసాగుతున్న ఉధృతి..

సంగారెడ్డి మండలం కల్పకూరు గ్రామ సమీపంలోని మంజీరా డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో రెండో నెంబర్​ గేట్​ ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ కు ఎగువన ఉన్న గంగ కత్వ, నంది, చిన్న వాగులు, కుంటల నుంచి మంజీరాకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంజీరా  పూర్తి నీటి సామర్థ్యం 16.51 అడుగులు, 1500 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1650 అడుగులకు 1278 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటి ప్రవాహం అధికమయ్యే అవకాశాలుండడంతో అప్రమత్తత ప్రకటించారు.