భద్రత, సౌకర్యాలపై వైద్యుల అసంతృప్తి
ఐఎంఏ నివేదికలో విస్తుగొలిపే విషయాలు కత్తులు, పెప్పర్ స్ప్రే లు వాడుతున్నామన్న మహిళా వైద్యులు
కోల్ కతా: మెడికో అత్యాచారం, హత్య ఓ వైపు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుంటే మరోవైపు ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) శనివారం విడుదల చేసిన నివేదిక వైద్యుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా పలువురు వైద్యుల ద్వారా సేకరించిన అభిప్రాయాల గణాంకాలను వెల్లడించింది. ఈ సర్వేలో 3885 మంది వైద్యుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. రాత్రి షిఫ్టుల్లో భద్రత ఉండదని 36 శాతం మంది వైద్యులు ఆవేదన వ్యక్తం చేయగా, సరైన సౌకర్యాలు, పడుకునేందుకు చోటు ఉండదని 45 శాతం మంది వైద్యులు వెల్లడించినట్లు తెలిపింది.
మహిళా వైద్యులు రాత్రిపూట విధుల్లో పాల్గొంటే తప్పకుండా రక్షణ కోసం కత్తులు, పెప్పర్ స్ప్రే లను తమ వెంట తీసుకువెళుతున్నట్లు 63 శాతం మంది వైద్యులు తెలిపారు. 20 నుంచి 30 యేళ్ల మధ్య ఉన్న మహిళా వైద్యుల్లో తీవ్ర అభద్రతా భావం ఉన్నట్లు తెలిపారు.
ఒకవేళ రూమ్ ఉన్నా టాయ్ లెట్ సౌకర్యం దూరంగా ఉండడం వల్ల రాత్రికి వెళ్లేందుకు భయంగా ఉంటుందని సర్వే నివేదికను ఐఎంఏ వెల్లడించింది.