గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

బీజేపీలో పలువురి చేరిక ఎమ్మెల్యే పాయల్​ శంకర్​

Aug 23, 2024 - 17:21
 0
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

నా తెలంగాణ, ఆదిలాబాద్​: స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఆవాల్పూర్ గ్రామంలో పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే కి గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్య ఘనసాగతం పలికారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బోయర్ తిరుపతితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు గ్రామస్తులు వందమంది కిపైగా ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే, ఆదినాథ్, మండల అధ్యక్షుడు దత్తా నిక్కం, జైనథ్ మండల అధ్యక్షుడు రాందాస్, మాజీ సర్పంచులు, ఇంద్రశేఖర్, రాకేష్, వివేక్, తేజ్ రావు, శివ కుమార్, బోనిగిరివార్ గణేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్ పొత్ రాజ్, బీజేపీ జనరల్ సెక్రెటరీ సందీప్ ఠాక్రే, ప్రవీణ్ కుమార్, నారాయణ్, బర్కాడే రాము, ప్రమోద్ రెడ్డి ధర్నే జీవన్ తదితరులు పాల్గొన్నారు.