భారత్ బంద్ విజయవంతం
Bharat Bandh was successful
నా తెలంగాణ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో బుధవారం సంపూర్ణ భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు ఈ బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత దేశంలోని ఎస్సీ కులంలో వర్గీకరణ చేస్తు తీర్చిచ్చిన సుప్రింకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు.
ఒక్కరోజు పాటు మార్కెటులోని దుకాణాలను మూసివేశారు. అనంతరం శాంతియుత ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెల్లి ఎంఆర్వోకు వినతిపత్రం అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం తీర్పును రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోకుంటే భారీ ఎత్తున నిరసన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో లార్డ్ బుద్ధ సొసైటీ నాయకులు, మహర్ బెటాలియన్ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, బీమ్ ఆర్మీ సైనికులు పాల్గొన్నారు.