ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్​ఎస్​

డీసీసీబీ చైర్మన్​ అడ్డి భోజారెడ్డి

Oct 1, 2024 - 19:54
 0
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్​ఎస్​
నా తెలంగాణ, ఆదిలాబాద్​: తెలంగాణ ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా రుణ‌మాఫీ, రైతుభ‌రోసాపై బీఆర్​ఎస్​ వ్యవహరిస్తున్న విధానాన్ని డీసీసీబీ ఛైర్మన్​ అడ్డి భోజారెడ్డి త‌ప్పు బ‌ట్టారు. మంగ‌ళ వారం జిల్లా కేంద్రంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశంలో మ‌ట్లాడారు. రాష్ట్రంలో ప‌దేళ్ళు అధికారం వెల‌గ‌బెట్టిన బీఆర్ఎస్ నాయ‌కులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్​ ఎస్​ దేనని మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. సాంకేతిక సమస్యల వల్ల రుణ ప్ర్రక్రియకు ఆటంకాలు ఏర్పడినట్లు గుర్తించామన్నారు. త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో చెరువులు, ఎఫ్టీఎల్​, బఫర్​ జోన్​ లలో 28వేల నిర్మాణాలు జరిగాయన్నారు. ఇదంతా బీఆర్​ఎస్​ పాపమేనన్నారు. పొంగులేటి పై ఈడీ దాడులను ఖండించారు. 
 
ఈ స‌మావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, ఎం.ఏ షకీల్, లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, సంద నర్సింగ్, వైస్ ప్రెసిడెంట్ సోనియా మంథని, నాయకులు పోరెడ్డి కిషన్, మొహమ్మద్ రఫీక్, రాజా లింగన్న, దొగ్గలి రాజేశ్వర్, శ్రీ రామ్, ఎల్మ రామ్ రెడ్డి, ఎం.ఏ కయ్యుమ్, అంజద్ ఖాన్, బండారి చిన్నయ్య, రమేష్, అతిక్ ఉర్ రహమాన్, దర్శనాల చంటి, అల్లాబకష్, మహిళా నాయకురాలు నేరెళ్ల లక్ష్మి, ఖమర్ బేగం తదితరులు పాల్గొన్నారు.