విజయపూరాలో బీజేపీ విజయఢంకా
BJP victory in Vijayapura
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ నుంచి విజయపూరా స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు తమ ప్రాంతం నుంచి ఎన్నికైన వారికి మంత్రి పదవిని ఇవ్వాలని కోరుకుంటారు. అదే అంశానికి కట్టుబడి ఉండి తమ ప్రాంత నాయకున్ని ఒంటిచేత్తో గెలిపించుకుంటారు. ఈ నియోజకవర్గం నుంచి 2014లో బీజేపీ తరఫున పోటీ చేసిన చంద్ర ప్రకాశ్ గెలుపొంది పరిశ్రమల శాఖ మంత్రిగా పదవిని దక్కించుకున్నారు. అంతకుముందు ఎన్నికల్లో సుర్జీత్ సింగ్ సలాథియా (ఎన్సీ) నుంచి గెలుపొంది విద్యుత్ శాఖ మంత్రి అయ్యారు. అటు పిమ్మట పరిణామాలతో బీజేపీలో చేరారు. విజయపూరా నుంచి 2024 ఎన్నికల్లో బీజేపీ గట్టి పట్టుసాధించింది. ఈ ప్రాంత బీజేపీ నాయకులతో ఇటీవలే కేంద్రమంత్రి, రాష్ర్ట ఎన్నికల ఇన్ చార్జీ జి.కిషన్ రెడ్డి కలిసి పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకున్నారు. విజయపురాలో బీజేపీ మరోసారి విజయఢంకా మోగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.