ముస్లింల జనాబా పెరుగుదల అభద్రతా భావం ఎందుకు
హిందువుల జనాభా తగ్గుదల పాక్, ఆప్ఝాన్, బంగ్లాలో హిందువుల జనాభాలో భారీ తగ్గుదల కారణాలను విశ్లేషిస్తాం భారత్ లో ముస్లింలకు అన్ని రకాల పథకాల వర్తింపు దుష్ట రాజకీయ పార్టీల వల్లే పెడధోరణి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లో 45 శాతం ముస్లింల జనాభా ఉందంటే వారు ఇక్కడ సురక్షితంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమ అభద్రతా భావాన్ని సృష్టిస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పాక్ లో 1947 విభజన తరువాత 23 శాతం ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం కేవలం 7 శాతంగానే ఉందని తెలిపారు. మరీ భారత్ లో ముస్లింల జనాభా పెరిగిందని ఏ దేశంలో అభద్రతా భావం ఉందో ఈ లెక్కలను బట్టి సులువుగా చెప్పవచ్చని తెలిపారు. భారత్ లో ఉన్న ముస్లింలకు అన్ని రకాల పథకాల ద్వారా పూర్తి సహాయం పొందుతున్న వారిలో ముస్లింలు కూడా అగ్రభాగాన ఉన్నారని అన్నారు. మహిళలకు ట్రిపుల్ తలాక్ ద్వారా విముక్తి కల్పించామన్నారు. పాక్ లో మహిళల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. దేశ ప్రజలతో సరిసమానంగా వారికి విద్య, వైద్యం, ఇళ్లు, నీరు, మౌలిక సదుపాయలను కల్పిస్తున్నామన్నారు. అయినా కొన్ని దుష్టశక్తులు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హిందువుల జనాభా 7.8 శాతం తగ్గిందని కూడా తెలిపారు. ఈ నివేదికను పరిశీలించాక, విశ్లేషించాక అసలు నిజాలు వెల్లడయ్యాయని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్ లలో హిందువుల జనాభా పూర్తిగా తగ్గిపోయిందన్నారు. అసలు అభద్రతా భావంలో ఉండాల్సింది హిందువులేనని తెలిపారు. దీని వెనుక ఉన్న కారణాలు పరిశీలిస్తామని ఠాకూర్ స్పష్టం చేశారు. మతప్రాతిపదికన రిజర్వేషన్లను ఎప్పటికీ ఆమోదించబోమని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.