విలువలకు తిలోదకాలు.. అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్​

మండిపడ్డ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి

Jun 25, 2024 - 17:14
Jun 25, 2024 - 17:16
 0
విలువలకు తిలోదకాలు.. అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ, ఇండి కూటమి పార్టీలు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఎక్స్​ మాధ్యమంగా మంత్రి కిషన్​ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. గత పదేళ్లుగా ప్రజలు కాంగ్రెస్​, ఆ మిత్రపక్షాలను తిరస్కరిస్తున్నా అధికారంలోకి రావాలనే యావతో రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమర్జెన్సీ విధింపు, ఎన్నికలను నిలిపివేయడం, పంజాబ్​ లో ఉగ్రవాదం, బుజ్జగింపు రాజకీయాల వంటి ఆ పార్టీల విధానాలు దేశ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో దేశంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.