ఉగ్రవాది సహాయకుడి అరెస్టు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

జమ్మూకశ్మీర్​ లోని బందిపోరా పెత్​ కూట్​ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదికి సహాయం చేస్తున్న ఓ వ్యక్తిని భద్రతా దళాలు, పోలీసులు సంయుక్త ఆపరేషన్​ ద్వారా ఆదివారం అరెస్టు చేశారు.

May 12, 2024 - 16:19
 0
ఉగ్రవాది సహాయకుడి అరెస్టు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

కాశ్మీర్​: జమ్మూకశ్మీర్​ లోని బందిపోరా పెత్​ కూట్​ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదికి సహాయం చేస్తున్న ఓ వ్యక్తిని భద్రతా దళాలు, పోలీసులు సంయుక్త ఆపరేషన్​ ద్వారా ఆదివారం అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి భారీ ఎత్తున పిస్తోల్లు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఉదంపూర్​ దాడి తరువాత భద్రతా బలగాలను ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. అణువణువు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈనేపథ్యంలో ఇంటలిజెన్స్​ సమాచారంతో ఇతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మందుగుండు సామాగ్రి లభ్యంతో ఉగ్రవాదులు మరోచోట దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోందన్నారు. ఈ కుట్రను భగ్నం చేశామని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.