హమాస్ చీఫ్ గా యాహ్వా సిన్వార్
Yahwa Sinwar as the chief of Hamas
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హమాస్ నూతన నాయకుడు (చీఫ్)గా యాహ్వా సిన్వార్ నియమితులైనట్లుగా తెలుస్తోంది. పాలస్తీనా శరణార్థి శిబిరంలో జన్మించిన ఇతను అత్యంత క్రూరత్వ ఆలోచనలు ఉన్నవాడుగా పేరు పొందాడు. ఇతన్ని గాజాలో ‘గాజా బిన్ లాడెన్ అని పిలవడం గమనార్హం. ఇతన్ని ఇదివరకే అమెరికా అంతర్జాతీయ టెర్రరిస్టుల గ్రూప్ లో ఉంచింది. ఇతని కార్యకలాపాలపై నిషేధం విధించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లో 1200మంది మరణం, 250మంది కిడ్నాప్ వెనుక ఇతను ఉన్నట్లుగా పలుమార్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇతను ఇంతవరకూ ఐడీఎఫ్ కు చిక్కలేదు. ఇస్మాయిల్ హనియా మృతి తరువాత హమాస్ నాయకుడిగా ఇతడి పేరును ప్రకటించడంలో ఇజ్రాయెల్, అమెరికాలు అప్రమత్తమయ్యాయి.
యాహ్వా చిన్నపిల్లలకు ఆయుధాలు అప్పగించి దాడులకు పాల్పడుతుంటాడని, బహిరంగ ఊచకోతలకు దిగుతుంటాడని కూడా అమెరికా, ఐడీఎఫ్ లు గుర్తించాయి. హమాస్ గూడాచార వ్యవస్థలో సిన్వార్ కీలక నాయకుడిగా ఎదిగాడు. గతంలో ఇతన్ని ఐడీఎఫ్ అరెస్టు చేసింది. విడుదలైన అనంతరం మరింత ప్రమాదకరంగా మారాడు.