నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: లెబనాన్ లో ఎలక్ర్టానిక్ పరికరాలు వినియోగించాంటేనే ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది. పేజర్, ఫోన్లు, వంటివే గాకుండా ఇజ్రాయెల్ గూడఛార సంస్థ మొస్సాద్ ఇంకా ఏయే మార్గాల్లో పేలుళ్లలకు ప్లాన్ చేసిందో తెలియక లెబనాన్ ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ ప్లాన్ ల వెనుక మొస్సాద్ లోని 8200 అనే టీమ్ కీలకంగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. మంగళవారం లెబనాన్ లో పేజర్లు పేలిన ఘటనలో 12మంది మృతి చెందగా, 3వేల మందికి గాయాలయ్యాయి. ఆ మరుసటి రోజే బుధవారం వాకీటాకీలు పేలి20మంది మృతి చెందగా, 450మందికి గాయాలయ్యాయి. హిజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ చర్యకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. కానీ సాక్ష్యాలు మాత్రం లభ్యం కాలేదు. పేజర్లు, వాకీటాకీలపై తైవాన్ పై ఆరోపణలు వస్తుండగా ఆ సంస్థ వివరణ కూడా ఇచ్చింది. దాడుల్లో తమ ప్రమేయం లేదంది. తాము తయారు చేసిన ఉత్పత్తుల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పలు సాక్ష్యాలను కూడా విడుదల చేసింది. దీంతో లెబనాన్ వ్యాప్తంగా జనసంచారం ఉన్న ప్రాంతాలు, రైళ్లు, బస్సులు, విమానాల్లో ఎలక్ర్టానిక్ గాడ్జెట్ లు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
మొస్సాద్ 8200..
మొస్సాద్ కు చెందిన 8200 టీమ్ సభ్యులను ఎన్నుకోవడంలో ఇజ్రాయెల్ అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తుంది. మానసిక, శారీరక, విద్య, ఆరోగ్యం, ఓర్పు, నేర్పులను పరీక్షిస్తుంది. అనంతరం కూడా వీరికి ప్రత్యేక శిక్షణనిస్తోంది. అటు పిమ్మట తాము ఎంచుకున్న లక్ష్యాల వైపు ఈ సభ్యులు వెళ్లి కామ్ గా వెళ్లి ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాకుండా తమ పని తాము చేసుకొని వెళతారు.
1976 న ఇజ్రాయెల్ విమానం హైజాక్ అయింది. ఇజ్రాయెల్ కు చెందిన102 మందిని ఉగ్రవాదులు ఉగాండాలోని ఎంటబ్బే విమానాశ్రయానికి తీసుకువెళ్లి ప్రభుత్వంతో డిమాండ్లు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా మొస్సాద్ ను రంగంలోకి దింపింది. మొస్సాద్ 8200 టీమ్ కు విమానాన్ని, ప్రయాణికులను సురక్షితంగా విడిపించాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన ఈ టీమ్ చడీ చప్పుడు చేయకుండా వారి దేశంలో ఏకంగా ఉగాండా అధ్యక్షుడు వినియోగిస్తున్న కాన్వాయ్ మాదిరి డమ్మీ కాన్వాయ్ ను ఏర్పాటు చేసి ఆపరేషన్ ను కొనసాగించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది. 102మందిని రక్షించింది. 20 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.