ఎందుకీ డిజిటల్ విధ్వంసం?

బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్  ప్రభుత్వ సమాచారం ప్రజల ఆస్తి

Jul 30, 2024 - 11:56
 0
ఎందుకీ డిజిటల్ విధ్వంసం?

నా తెలంగాణ, హైదరాబాద్​: ప్రభుత్వ వెబ్‌సైట్లు, డిజిటల్ విభాగంపై జరుగుతున్న విధ్వంసంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎస్ జోక్యం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ హయాంలోని సమాచారం, వివరాలు తొలగించారన్నారు. గత ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి అని చెప్పారు. భావి తరాల కోసం ఈ డిజిటల్ సంపదను రక్షించాలని కోరారు. వెంటనే సీఎస్ తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. గతంలోనూ అధికారిక వెబ్‌సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం మాయమైందని ఆరోపించారు. దీని వెనుక పాలకుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారని కేటీఆర్ ఆరోపించారు.