మనల్ని రక్షించుకుంటూ.. కుక్కల్ని బతకనిద్దాం!
Let's protect ourselves.. Let's save the dogs!
రాష్ట్రంలో పసికూనలు, చిన్నారులు, మహిళలు, రోడ్లు, విధుల్లో వెళ్లే వారిపై విధి కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశ్వాసానికి మారు పేరైన కుక్కలు ఇలా ప్రవర్తిస్తుండడంతో వాటి గురించి వింటేనే ఒళ్లు జలదరిస్తున్నది. హైదరాబాద్ జవహర్ నగర్ లో ఇటీవల ఏడాదిన్నర పసివాడిని అవి పీక్కు తినడం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఆలస్యంగా వెలుగులోకిచ్చిన మరో ఘటన జగిత్యాల జిల్లా మంగెలలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది. అయితే అక్కడ ఓ వృద్ధురాలు దాన్ని ఎదిరించి గొప్ప సాహసం చేసింది. దాంతో పిల్లాడిని వదిలి కుక్క పారిపోయింది. కొన్ని రోజుల క్రితం మణికొండలో ఓ మహిళపై 15 కుక్కలు దాడిచేసిన విషయం తెలిసిందే. చెప్తూ పోతే ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. వాటి వల్ల పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగులు రోడ్ల వెంట వెళ్లాలంటే జంకుతున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఏదోచోట పునరావృతం అవుతూనే ఉన్నాయి.
కుటుంబ నియంత్రణ...
ముఖ్యంగా వాటికి ఆహారం దొరక్కపోవడంతో జనావాసాల మధ్య ఉంటూ దాడుల తెగబడుతున్నాయి. కనిపించిన వారినే ఆహారంగా భావించి నోట కరుస్తున్నాయి. చేతిలో ఏదైనా పట్టుకొని వెళ్తున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అలాంటి సందర్భాల్లో ప్రజలు, పిల్లలపై విరుచుకుపడుతున్నాయి. ఇక పట్టణాలు, నగరాల్లో అయితే స్థానికులు ఇళ్ల నుంచి తెచ్చి రోడ్లు, వీధుల్లో పడేస్తున్న ఆహార పదార్ధాలు, ఇతర పొట్లాల్లో ఉన్న వాటిని తినడం కోసం పోటీ పడుతున్నాయి. ఏదో విధంగా ఆకలి తీర్చుకోవడానికి వేంపర్లాడుతున్నాయని ఓ పరంగా చెప్పవచ్చు. అయితే గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కుక్కల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అరకోరగా కొనసాగుతున్నాయి. వాటి కుటుంబ నియంత్రణ చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. దాంతో గుంపులుగా తిరుగున్నాయి.
ఆకలి తీరిస్తే...
వాటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే బాగుటుంది. కుటుంబ నియంత్రణ చర్యలు పకడ్బందీగా నిర్వహించాలి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వాటిని పట్టుకొని నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేయాలి. వాటిమానాన అవే జీవించేలా ఆహారాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. అందుకు చిన్నాచితక హోటళ్లు, పెద్దపెద్ద రెస్టారెంట్లలో రాత్రి, పగలు మిగిలిన ఆహార పదార్థాలను సర్కారు, ఎన్జీవో సంస్థలు, సామాజిక సేవకులు సేకరించి వాటి ఆకలి తీరిస్తే సరిపోతుంది. అదేవిధంగా మాంసాహార మార్కెట్లలో కోడి, మేక, చాపలు, ఇతర మాంసపు చర్మం, ఎముకలు లాంటివి సేకరించి వాటికి ఆరంగా అందిస్తే సరిపోతుంది. తద్వారా కుక్కలు జనావాసాల మధ్య ఉండకుండా చూసుకోవచ్చు. ప్రజలను ఆ జాతి భారీ నుంచి రక్షించవచ్చు. దాంతో వాటి ప్రాణాలకు ఎలాంటి అపాయము, ముప్పు లేకుండా జీవిస్తాయి. ఇలా తమను తాము(మనల్ని) రక్షించుకుంటూ.. కుక్కలనూ బతకనిద్దాం. ప్రతి జీవికి ఈ భూమిపై జీవించే హక్కు ఉందని గమనిద్దాం.
తలారి గణేశ్
సామాజిక కార్యకర్త, జంతు ప్రేమికుడు
9948 026 058