సీఎంకు విద్వత్సభ నివేదిక

2025-26 పండుగల జాబితా అందజేసిన సిద్ధాంతి బృందం

Jul 30, 2024 - 11:54
 0
సీఎంకు విద్వత్సభ నివేదిక

నా తెలంగాణ, హైదరాబాద్​ : పంచాంగకర్తలు, సిద్ధాంతులు ధర్మశాస్త్రాలకు అనుగుణంగా చర్చించి, నిర్ణయించి, ఆమోదించిన విశ్వావసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను తెలంగాణ విద్వత్సభ బాధ్యులు సోమవారం సీఎం రేవంత్​ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో, మంత్రి కొండా సురేఖకు జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో అందించారు. ఈ సందర్భంగా విద్యత్సభ బాధ్యులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ అభినందించారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రాధ్యాతనిస్తూ విద్వత్సభ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశాంసనీయమైనవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా తీర్చాలని దేవాదాయ శాఖకు సీఎం సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పండుగల నిర్వహణలో ఎలాంటి అనిశ్చితి తలెత్తకుండా పండుగల జాబితాను నిర్ధారించి అందించిన విద్వత్సభను మంత్రి సురేఖ అభినందించారు. వారి కృషి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్,  కమిషనర్ హన్మంతరావు, భద్రకాళి దేవాలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, యాదాద్రి దేవస్థానం ఛైర్మన్ నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నర్సింహాచార్యులు, తెలంగాణ విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి ఎంవీఆర్ శర్మ (దర్శనం శర్మ), నటరాజ శర్మ, సాయి దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.