కనెక్టివిటీలో వేగం

చర్లపల్లి రైల్వే స్టేషన్​ లో కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Oct 20, 2024 - 14:05
 0
కనెక్టివిటీలో వేగం
  • 98 శాతం పనులు పూర్తి
  • వచ్చే నెలలో ప్రారంభం
  • త్వరలో యాదాద్రి మెట్రో పనులు ప్రారంభం
  • కొమురవెళ్లి స్టేషన్​ ఏర్పాటు
  • దక్షిణాదిలో సికింద్రాబాద్​ స్టేషన్​ అత్యాధునికం
  • చర్లపల్లి రోడ్ల విస్తరణకు ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • పెడచెవిన పెట్టిన బీఆర్​ఎస్​
  • యుద్ధప్రాతిపదికన విస్తరణ పనులకు ప్రభుత్వం హామీ
నా తెలంగాణ, హైదరాబాద్​: ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైల్వేలకు జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతంగా పూడ్చే పనిలో ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్​, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రోలైన్​, కొమురవెల్లికి ప్రత్యేక రైల్వే స్టేషన్​ లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పచ్చజెండా ఉపారని కేంద్రమంత్రి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 
 
ఆదివారం మంత్రి జి.కిషన్​ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్​ ను సందర్శించి జరిగిన పనులపై అధికారులతో ఆరా తీశారు. స్టేషన్​ మొత్తం కలియదిరిగి ఏ మేరకు పనులు జరిగాయి? ఇంకా ఏ మేరకు జరగాల్సి ఉంది? అనే విషయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
సకల సౌకర్యాలతో..
అనంతరం మీడియాతో మాట్లాడారు. చరపల్లి టెర్మినల్​ పునర్​ నిర్మాణానికి రూ. 430 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రస్తుతం 98 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చె నెలఖరు వరకు ప్రయాణికులకు ఈ స్టేషన్​ ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు.  ఈ రైల్వే స్టేషన్​ లో అత్యాధునిక సౌకర్యాలతో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు, రెస్ట్​ రూమ్​ లు, వెయిటింగ్​ రూమ్​ లు,  భద్రతా లాంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. 
 
ఓఆర్​ఆర్​ ద్వారా చర్లపల్లికి..
చర్లపల్లి టెర్మినల్​ అందుబాటులోకి వస్తే ప్రధానంగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ వద్ద ట్రాఫిక్​ తగ్గుతుందన్నారు. ఓఆర్​ ఆర్​ ద్వారా చర్లపల్లికి త్వరగా చేరుకోవచ్చన్నారు. అదే సమయంలో చర్లపల్లికి దారి తీసే రహదారులపై గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో రహదారుల విస్తరణపై మాట్లాడానని తెలిపారు. భరత్​ నగర్​ 80 అడుగుల రోడ్డు విస్తరణ, మహాలక్ష్మి వైపు 80 అడుగులు, ఇండస్ర్టీయల్​ వైపు 100 ఫీట్ల రోడ్లు ఉండాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.  ప్రభుత్వం ఇందుకు పూర్తిసన్నద్ధతను వ్యక్తం చేసిందని అందుకు సంబంధించిన పనులు కూడా మొదలుపెడతామని మంత్రి తెలిపారు. ఈ రైల్వే స్టేషన్​ లో 20 రైళ్లను నిలిపే సదుపాయం ఉందన్నారు. భవిష్యత్​ లో గూడ్స్​ రైళ్ల ద్వారా ఇక్కడి నుంచే ట్రాన్స్​ పోర్టింగ్​, లోడింగ్​, అన్​ లోడింగ్​ ను దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. 
 
గ్రీనరీకి అధిక ప్రాధాన్యం..
ఈ రైల్వే స్టేషన్​ లో పర్యావరణ హిత చర్యలు తీసుకున్నామని మంత్రి కిషన్​ రెడ్డి వివరించారు. చర్లపల్లి స్టేషన్​ ఆధునికత, పునరుద్ధరణ ద్వారా 500 చెట్లను రీ లొకేట్​ చేశామన్నారు. ఇందుకు ప్రతీకా 5500 చెట్లను పెంచాలని నిర్ణయించామన్నారు. దీంతోపాటు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో 3000 మొక్కలు నాటి వాటన్నింటికీ రెయిన్​ హార్వెస్టింగ్​ ద్వారా రక్షించాలని నిర్ణయించినట్లు తెలిపారు. చర్లపల్లి లో సివరేజీ ప్లాంట్​ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.  చర్లపల్లిలో ఎలక్ర్టిక్ చార్జీంగ్​ 12 పాయింట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
 
అమృత్​ కింద ఆధునీకత..
మోదీ ప్రభుత్వం అమృత్​ పథకం కింద తెలంగాణలో 40 చిన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబించేలా ఆధునికతతో వీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో 346 కి.మీ. కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు, 369 కి.మీ. సింగిల్​, డబ్లింగ్​, ట్రిపులింగ్​ లను చేశామన్నారు.  సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ లో 110 కిలోవాట్స్​ వందశాతం విద్యుత్​ వినియోగం సోలార్​ పవార్​ తోనే వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 
 
యాదాద్రికి ఎంఎంటీఎస్​..
భక్తుల సౌకర్యార్థం యాదాద్రికి ఎంఎంటీఎస్​ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. త్వరలోనే ఈ పనులు కూడా చేపడతామన్నారు. కొమురవెల్లి మల్లనను దర్శించుకునే భక్తుల కోసం కూడా మోదీ ప్రభుత్వం రైల్వే స్టేషన్​ ను నిర్మాణం చేపట్టిందన్నారు. ఇక్కడికి కూడా త్వరలో రైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
 
176 రైల్వే స్టేషన్​ లలో ఫ్​రీ హై స్పీడ్​ వైఫై..
రైల్వే క్రాసింగ్​ లు, ఆర్​ యూబీలు, అండర్​ గ్రౌండ్​ బ్రిడ్జిలు, ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణం ఇలా అనేక కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి వివరించారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలోని 176 రైల్వే స్టేషన్లలో హై స్పీడ్​ ద్వారా వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కొన్ని రైల్వే స్టేషన్లలో 86 స్థానిక ఉత్పత్తుల స్టాల్స్​ ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం లభించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.