బడ్జెట్ పై ఎవరేమన్నారు?
Who said on the budget?
దేశ ప్రజల అభివృద్ధియే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉంది. యువత, రైతులు, మహిళా శక్తికి పెద్దపీట వేశారు. నిరుద్యోగులకు మేలు చేకూరడంతోపాటు దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా
అధునాతన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, నూతన సంస్కరణలను చేపట్టేలా బడ్జెట్ ను తీర్చిదిద్దడం అభినందనీయం. సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకున్నారు. సుసంపన్నమైన బడ్జెట్. బలమైన భవిష్యత్ కు ఈ బడ్జెట్ పునాది వేయనుంది.
కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ
టీ వర్కర్స్ ఇన్సెంటివ్ స్కీమ్ అమలుకు కేంద్ర బడ్జెట్‌లో రూ 1000 కేటాయింపులు అభినందనీయం. దీంతో అసోంలోని టీ తోటల పెంపకాలు, ఉత్పత్తి, విక్రయాలు పెరుగుతాయి.
అసోం సీఎం శర్మ
ఈ బడ్జెట్ మధ్యతరగతి వర్గాల కలలను ప్రతిబింబించేలా ఉంది. వారిపై పన్నుల భారాన్ని తగ్గించడం అభినందనీయం. అదే సమయంలో నిరుపేదలు, మధ్యతరగతి సొంతింటి కలను సాకారం చేసుకునేలా ఉంది.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
బిహార్ ప్రత్యేక హోదానే ఆశించినా బడ్జెట్ లో నిధుల కేటాయింపులు హర్షణీయం. ఇది గొప్ప ప్యాకేజీయే. దీంతో ఈ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన మరింత మెరుగవుతుంది. ప్రతీ రంగంలో వృద్ధి నమోదు చేసుకునే అవకాశం ఉంది.
జేడీయూ లలన్ సింగ్
కొత్త పన్ను ప్రకటన స్వాగతించదగినదే. భారత సూదూర లక్ష్యాలైన ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో ఈ బడ్జెట్ దోహదపడుతుంది.
యూపీ సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
రైతుల సంక్షేమాన్ని కోరుకునే దిశగా బడ్జెట్ కు రూపం కల్పించడం సంతోషకరం. రైతుల కోసం అనేక పథకాలను అమలు చేయడం హర్షణీయం. మహారాష్ర్ట రైతులకు ఈ బడ్జెట్ ద్వారా పెద్ద యెత్తున ప్రయోజనం చేకూరనుంది.
మహారాష్ర్ట డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
బంగారం, వెండిపై దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం సరైంది. దీంతో కొనుగోళ్లు భారీ యెత్తున జరిగే అవకాశం ఉంది.
పీఎన్ జీ జువెలర్స్ ఛైర్మన్ సౌరభ్ గాడ్గిల్
బంగారం, వెండి ధరలపై సుంకం తగ్గింపు నిర్ణయంతో స్మగ్లింగ్ కు అడ్డుకట్ట పడుతుంది. తద్వారా పారదర్శకమైన కొనుగోళ్లకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ పరిశ్రమలకు మరింత ఊతం లభిస్తుంది.
జువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్
ఉపాధి, కలలు సాకారం. సామాన్య పౌరులు, యువతను ఉపాది దిశగా పయనింపజేసే అంశాలపై దృష్టి సారించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
బడ్జెట్ లో సమతూకాన్ని పాటించారు. మహిళలు, యువత, రైతులు, కార్మికులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. బిహార్ కు ప్యాకేజీ ప్రకటించడం గొప్ప విషయం
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్