హరియాణాలో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్​

వివరాలు వెల్లడించిన సీఎం నాయాబ్ సింగ్​ సైనీ

Jul 17, 2024 - 19:32
 0
హరియాణాలో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్​

చండీగఢ్​: అగ్నివీరులకు పోలీసు, మైనింగ్ గార్డ్​ లాంటి ఉద్యోగాల్లో 1‌‌0 శాతం రిజర్వేషన్​ ను కల్పించనున్నట్లు సీఎం నాయబ్​ సింగ్​ సైనీ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం హరియాణా కేబినెట్​ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అగ్నివీర్​ పథకం ద్వారా సైన్యంలో పనిచేసి నాలుగేళ్ల తరువాత తిరిగి రావాలనుకున్న వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలైన పోలీసు, అగ్నిమాపక శాఖ, ఫారెస్ట్​ గార్డ్​, జైలు వార్డెన్​, ఎస్పీవో లాంటి పోస్టుల్లో 10 శాతం రిజర్వేషన్​ కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. వయో సడలింపును కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. మరికొద్ది నెలల్లో హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత నెలకొంది.