బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి
మిత్రపక్షాలకు పెద్దపీట రాష్ట్ర ప్రస్తావనే లేకపోవడం శోచనీయం మరిపెడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్
నా తెలంగాణ, డోర్నకల్: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయే లభించిందని మహాబూబాబాబాద్ జిల్లా మరిపెడ మండల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ అన్నారు. మంగళవారం బడ్జెట్ విడుదల అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
బిహార్, ఆంధ్ర ప్రదేశ్ కు భారీ ఎత్తున నిధులు కేటాయించి పెద్ద పీట వేసి తెలంగాణను మరిచారని విమర్శించారు. బడ్జెట్ లో ఎక్కడా తెలంగాణ ప్రస్తావనే లేకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తే నిరాశ తప్పలేదన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టాలా బడ్జెట్ ఉందని తాజుద్దీన్ విమర్శించారు. తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.