రూ. 20కే నకిలీ ఆధార్​, ఓటర్​, పాన్​ కార్డులు

Rs. 20K fake Aadhaar, Otter, PAN cards

Dec 25, 2024 - 17:23
 0
రూ. 20కే నకిలీ ఆధార్​, ఓటర్​, పాన్​ కార్డులు

ఢిల్లీలో పట్టుబడిన సిండికేట్​ విచారణలో కీలక విషయాలు వెల్లడి
అక్రమ బంగ్లాదేశీయుల చొరబాటులో భారతీయుల హస్తం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత గుర్తింపు కార్డులు అంగట్లో సరుకులా కొందరు విక్రయిస్తూ అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. రూ. 20లకే గుర్తింపు కార్డుల నకిలీలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో పట్టుబడిన బంగ్లాదేశీయులు, వీరికి అక్రమంగా పలు రకాల భారత గుర్తింపు కార్డులను అందజేసిన వారిని పోలీసులు విచారించారు. బుధవారం విచారణలో నిందితుల ద్వారా వెల్లడైన విషయాలను పోలీసులు మీడియాతో పంచుకున్నారు. నకిలీ గుర్తింపు కార్డుల పేరుతో పెద్ద సిండికేట్​ ను ఏర్పాటు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ రాకెట్​ మొత్తం ఓ హత్య కేసును విచారిస్తుండగా వెల్లడైందన్నారు. దీంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. నిందితుల విచారణలో పలు ఈ విషయాలు తేటతెల్లమయ్యాయని చెప్పారు. మృతి చెందిన వ్యక్తి ఆటోడ్రైవర్​ అని నకిలీ ఆధార్​ కార్డులను తయారు చేసేవాడని తెలిపారు. లావాదేవీల్లో తేడాల వల్లే సహచరులు ఇతన్ని హత్య చేసినట్లు గుర్తించామన్నారు. 

ఈ బృందమే సిండికేట్​ గా మారి బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా అడవి మార్గం ద్వారా భారత్​ లోకి పలువురిని తీసుకువచ్చేవారన్నారు. వారికి సిమ్​ కార్డులు, ఆధార్​ కార్డులు, ఓటర్​ కార్డులు అందించేవారని తెలిపారు. నకిలీ కార్డులను కేవలం రూ. 20లకే అందజేసేవారన్నారు. వీరి వద్ద నుంచి 4 నకిలీ ఓటర్​ కార్డులు, 21 ఆధార్​ కార్డులు, ఆరు పాన్​ కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నకిలీ కార్డుల వెనుక రజత్​ మిశ్రా అనే వ్యక్తి ఉన్నాడని తెలిపారు. బంగ్లా ద్వారా అక్రమంగా భారత్​ లోకి ప్రవేశించిన నెట్​ వర్క్​ ను గుర్తించామన్నారు.