ముత్యాలమ్మ కుంటేదీ?

ఇష్టారీతిన మట్టి తవ్వకాలతో చెరువు కనుమరుగు పట్టించుకోని అధికారులు శ్రీ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇష్టారాజ్యం ఈఈకి ఫిర్యాదు చేసిన పలువురు గ్రామస్థులు

Jul 23, 2024 - 15:44
Jul 23, 2024 - 15:45
 0
ముత్యాలమ్మ కుంటేదీ?

నా తెలంగాణ, డోర్నకల్: ముత్యాలమ్మ చెరువు నుంచి ఇష్టారీతిన మట్టితవ్వకాలు చేపడుతూ చెరువు మనుగడను శ్రీ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రశ్నార్థకంగా మారుస్తుందని మాదాపురం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మాదాపురం తోపాటు పలు గ్రామాల రైతులు ఈ ఈ సమ్మిరెడ్డికి ఈ విషయంపై ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మహాబూబాబాద్​ జిల్లాలో చాలా చెరువుల పరిస్థితి ఇదే మాదిరిగా ఉందన్నారు. ముత్యాలమ్మ కుంట పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పూర్తిగా మట్టిని తవ్వేయడంతో స్థానికంగా ఉన్న పోలాలకు నీరు అందే పరిస్థితులు లేవన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. పలుమార్లు ఈ సంస్థకు, అధికారులకు ఇదే విషయాన్ని మొర పెట్టుకున్నా వారు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. చెరువును పునరుద్ధరించే చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా చెరువులలో అక్రమ తవ్వకాల విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు మతలబులేంటో? అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.