కొకైన్ వెనుక డీ గ్యాంగ్?!
రాజధానికి అడ్డాగా మారుద్దామని నిందితుల ప్లాన్
ఇంటలిజెన్స్ ఆపరేషన్ తో భారీ ఎత్తున డ్రగ్ స్వాధీనం
దుబాయ్ బడా వ్యాపారవేత్త ఎవరు?
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీని మాదకద్రవ్యాలకు అడ్డాగా, ప్రధాన నగరంగా మార్చాలని ‘డీ’ గ్యాంగ్ ప్రణాళికలు రచించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బుధవారం లభించిన 560 కిలోల కొకైన్ రూ. 5600 కోట్ల విలువ చేస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ ముఖ్య కేంద్రం ఢిల్లీలోని ‘డీ’ గ్యాంగ్ చేపట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తెరవెనుక బడా నాయకుల హస్తం వెలికివస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
దుబాయ్ కి చెందిన ఓ బడా వ్యాపారవేత్త ద్వారా ఈ కొకైన్ సరఫరా అయ్యింది. అక్కడి నుంచి చేతులు మారుతూ తుషార్ మోహతా చేతికి వచ్చింది ఈ సమగ్ర ఆపరేషన్ పై ఇంటలిజెన్స్ వర్గాలు పూర్తి నిఘా వేసి ఉంచాయి. మూడు నెలల అనంతరం సక్సెస్ ను సాధించాయి.
ఇంతపెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంపై ఇంటలిజెన్స్ స్పెషల్ పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. స్థానిక పోలీసుల ద్వారా విషయం బయటికి పొక్కే అవకాశం ఉండడంతో విషయాన్ని గోప్యం ఉంచారు. ఆపరేషన్ పూర్తి అయ్యిందనే సమయానికి పోలీసులతో ఎంట్రీ ఇచ్చి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రగ్ దుబాయ్ నుంచి మరియానా ఫుకెట్ నుంచి విమానంలో తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, దేశంలో జరిగే పెద్ద పెద్ద పార్టీల్లో కొకైన్ ను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
తుషార్ గోయల్..
తుషార్ గోయల్ కాంగ్రెస్ నాయకుడు(టింగు రంగడు). ఇతనికి రైట్ హ్యాండ్ గా ఔరంగజేబ్ అనే వ్యక్తి వ్యవహరిస్తుంటాడు. ఈ కొకైన్ కు చెల్లింపులను క్రిప్టో కరెన్సీ ద్వారా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తుషార్ తండ్రి పెద్ద వ్యాపారవేత్త. ఇతనికి విలాసవంతమైన జీవితం గడపడం అంటే మహాఇష్టమట. 2022లో కాంగ్రెస్ ఢిల్లీ ఆర్టీఐ సెల్ చైర్మన్ గా ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కింగ్ పిన్ ఎవరనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాంగ్రెస్ బడా నేతల హస్తం కూడా ఉండొ ఉంటుందని భావిస్తున్నారు. నిందితుని సెల్ నుంచి సంభాషించిన ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు.