సుప్రీం నూతన న్యాయమూర్తుల పదవి ప్రమాణ స్వీకారం

Swearing in of new Supreme Court judges

Jul 18, 2024 - 12:58
 0
సుప్రీం నూతన న్యాయమూర్తుల పదవి ప్రమాణ స్వీకారం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో సుప్రీం చీఫ్​ జస్టిస్​ చంద్రచూడ్​ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్​ ఎన్​ కోటీశ్వర్​ సింగ్​, జస్టిస్​ ఆర్​ మహదేవన్​ లు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరిగింది. వీరిద్దరి నియామానికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. 

జస్టిస్​ ఎన్​. కోటీశ్వర్ సింగ్​ మణిపూర్​ లోని ఇంపాల్​ లో జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం 2007లో మణిపూర్​ కోర్టుకు జనరల్​ అడ్వకేట్​ గా నియమితులయ్యారు. మణిపూర్​, గౌహాతి, జమ్మూ అండ్ కాశ్మీర్​ లకు కూడా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేపట్టారు.

జస్టిస్​ ఆర్​ మహదేవన్​ తమిళనాడు చెన్నైలో జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం తమిళనాడు ప్రభుత్వం రఫున న్యాయవాదిగా కొనసాగారు. మద్రాస్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.