మోదీ స్వచ్ఛత సంస్కృతిలో భాగం

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

Oct 3, 2024 - 14:58
 0
మోదీ స్వచ్ఛత సంస్కృతిలో భాగం

గాంధీనగర్​: ప్రధాని మోదీ స్వచ్ఛత ప్రజా ఉద్యమంగా మారి పరిశుభ్రత అనే సంస్కృతిని పెంపొందించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా సంతోషం వ్యక్తం చేశారు. గురువారం గుజరాత్​ లోని గాంధీనగర్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో రూ. 470 కోట్లకు పైగా అభివృద్ధి పనులను మంత్రి షా ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలో గాంధీనగర్​ లో రూ. 37వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, వివిధ రకాల ప్రాజెక్టులకు ఇందులో స్థానం కేటాయించామన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలను స్మార్ట్​ గా తీర్చిదిద్దడంలో అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పాత్రను కొనియాడారు. సాయంత్రం గుజరాత్​ టూరిజం శాఖ నిర్వహిస్తున్న వైబ్రెంజ్​ గుజరాత్​ నవరాత్రి వేడుకలను మంత్రి అమిత్​ షా ప్రారంభిస్తారు. మూడురోజుల వేడుకల్లో పాల్గొననున్నారు.