మంగళవారమే జమిలి బిల్లు!
Tuesday' ONOE bill!
ప్రవేశపెట్టనున్న మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (జమిలి) ఎన్నికల బిల్లును మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కాగా బిల్లు ఆమోదానికి 361 ఎంపీలు అవసరం. ఎన్డీయేకు 293 మంది ఎంపీలు, ఇండి కూటమికి 235 మంది ఎంపీల మద్ధతు ఉంది. ఈ నేపథ్యంలో ఇతర విపక్షాలతో కూడా కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. పూర్తి మద్ధతుతో బిల్లును ఆమోదింప చేసుకోవాలని మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపే అవకాశం ఉంది.
బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుత పార్లమెంట్ పదవీ కాలం 2029 మే తో పూర్తి అవుతుంది. మే ఎండాకాలం అవడం వల్ల శీతాకాలంలో అన్ని రాష్ర్టాల ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఇంకా కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు.
రాజ్యాంగంలో సవరణలు..
లోక్‌సభ, అన్ని శాసనసభలకు, ఆర్టికల్ 83 (పార్లమెంటు సభల కాలవ్యవధి) ఆర్టికల్‌కు ఏకకాలంలో ఎన్నికలు జరిగేలా బిల్లులో కొత్త ఆర్టికల్ 82ఎని జోడించాలి. 172 (రాష్ట్ర శాసనసభల వ్యవధి), ఆర్టికల్ 327 (శాసనసభలకు ఎన్నికలకు సంబంధించి నిబంధనలను రూపొందించడానికి పార్లమెంటు అధికారం) సవరించాలి. అమలులోకి వచ్చిన తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ మొదటి సమావేశ తేదీపై రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ తేదీని అపాయింటెడ్ డేట్ అంటారు. లోక్‌సభ పదవీకాలం నియమిత తేదీ నుంచి ఐదేళ్లు ఉంటుంది. శాసన సభల పదవీకాలం నియమిత తేదీ తర్వాత, లోక్‌సభ పూర్తి పదవీకాలం ముగిసేలోపు ఉంటుంది. లోక్‌సభ పదవీకాలంతో శాసనసభల పదవీకాలం కూడా ముగుస్తుంది.