కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాలాపూర్ లడ్డూ ప్రసాదం
అందజేసిన బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన బాలాపూర్ వినాయకుడి ప్రసాదం (లడ్డూ)ను తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి బీజేపీ నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి అందించారు. గురువారం ఉదయం బీజేపీ నగర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ప్రసాదాన్ని అందజేశారు. ప్రసాదం అందతలో కొలన్ శంకర్ రెడ్డితోపాటు సూర్యప్రకాశ్, గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
బాలపూర్ లడ్డూను కొలన్ శంకర్ రెడ్డి రూ. 30,01,000లకు దక్కించుకున్నారు. ఈ లడ్డూ బరువు 21 కేజీలు. లడ్డూను ప్రతీ ఒక్కరికీ అందజేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కొలన్ శంకర్ రెడ్డి తెలిపారు.