మాటలు కోటలు దాటి.. నంబర్లు నవ్వు తెప్పిస్తే?

Which party is likely to get the majority of MP seats in Telangana?

May 13, 2024 - 13:55
 0
మాటలు కోటలు దాటి.. నంబర్లు నవ్వు తెప్పిస్తే?

ఎన్నికల్లో డబ్బు తీసుకొని ఓట్లు వేస్తున్నందుకు ఓటర్లు సిగ్గుపడాలని మేధావులు వ్యాఖ్యలు చేస్తున్నారు. సిగ్గుపడటం మరచిపోయిన నాయకుల గురించి మాత్రం పెద్దగా వారు వ్యాఖ్యలేమీ చేయటం లేదు. అయినా... మేధావుల మాట ఎన్నికలప్పుడు వింటారా ఎవరైనాసహజంగా ఎన్నికలప్పుడు నాయకుల మాటలే జనం వింటుంటారు. అంతిమంగా నిర్ణయం తమ ఇష్టం వచ్చినట్టే తీసుకున్నానేతల మాటలు వినడానికి మాత్రం ఇదివరలో ఓటర్లకు పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. ఈ మధ్యఅవికూడా అంత వినసొంపుగా ఉండటం లేదు. ప్రజల గురించోప్రజా సమస్యల గురించో మాట్లాడితే సరే! ఆ దశ దాటి వట్టి విమర్శలు`ప్రతివిమర్శలతో ప్రసంగాలు సాగిన రోజులచ్చాయి. అవీ భరించారు జనంవిధిలేక! ఇకఇప్పుడు పరస్పరం బూతులు తిట్టుకోవడంనోటికొచ్చింది మాట్లాడి మీడియాకెక్కడం నాయకులకు రివాజయింది. వారు ఆడే అబద్దాలకు కొలతా లేదుకొరవా లేదు! బంకరా శంకరయ్యా అంటే, ‘తాండూరు మిరియాలు తాటికాయలంత!’ అన్నాట్ట వెనుకట ఒకాయన! నోటికి ఎంతొస్తే అంత.... సిగ్గూ యెగ్గూ లేకుండా మాట్లాడేస్తున్నామే! అర్థంపర్థం లేని నంబర్లు చెప్పేస్తున్నామేరేపు ఫలితాలు వచ్చాక ఏమౌతుందో మనకిప్పుడే తెలుసు కద! మరిఅప్పుడు జనం నవ్విపోతారేమో?’ అన్న దిగులు కించిత్తు కూడా లేకుండానే మాట్లాడేస్తున్నారు. జనం సమస్యల పట్ల చింత లేకతాము నోరు జారే మాటల పట్ల సిగ్గు లేక రాజకీయ నాయకులు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎదురుగా అమరిస్తే, ‘లై డిటెక్టర్లు’ పేలిపోయేంతటి అబద్దాలనైనా అలవోకగా ఆడేస్తున్నారు.


పది పైనే స్థానాలు బీజేపీ గెలుస్తుందని అమిత్‌షా వంటి అగ్రనేతలతో సహా పార్టీ ముఖ్యులంతా గంభీరంగా చెబుతున్నారు. పద్నాలుగు సీట్ల వరకు మేెమే గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్‌ ముఖ్యనాయకులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పన్నెండు నుంచి పద్నాలుగు సీట్ల వరకు తామే గెలుస్తామనిగెలవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నట్టు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బల్ల గుద్ది చెబుతున్నారు. ఇదంతా వింటుంటే జనానికి పిచ్చెక్కిపోతోంది. ప్రధాన పార్టీల ముఖ్యనాయకుల మాటలు వింటుంటే రాష్ట్రంలో కనీసం ముఫ్పై నుంచి నలబై వరకు లోక్‌సభ స్థానాలు ఉన్నాయేమోఅని సందేహం కలుగటం సహజం! కానీఉన్నది 17 సీట్లే! అందులోనూప్రధాన స్రవంతి పార్టీల వారెవరైనా ఒకటి (హైదరాబాద్‌ స్థానంఏఐఎంఐఎం కి వస్తుందని) విడిచిపెట్టే లెక్కలు పెడతారు. ఇంతగా అంచనాకు దొరక్కుండా ఉంటుందా ప్రజానాడిఅంటేఅదేం కాదు! ఎవరికి వారు తామే గెలువబోతున్నామని బంకి అయినా సరే ఓటర్లను తమ వైపే తిప్పుకోవాలనే పేరాశ! ఇదంతా చూస్తుంటే ముఫ్పైయేళ్ల కింది కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చింతామోహన్‌ చేసిన వ్యాఖ్య ఒకటి గుర్తొస్తోంది. 1994 ఎన్నికలప్పుడుపోలింగ్‌ ముగిసి ఓట్ల లెక్కింపు మాత్రం మిగిలి ఉంది. నాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యనాయకులు కొందరు ఢల్లీిలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ను కలవడానికిరేస్‌కోర్స్‌రోడ్డులో ఆయ నివాసానికి వచ్చి నిరీక్షిస్తున్నారు. పిచ్చాపాటి కబుర్ల మధ్య చింతామోహన్‌, ‘ఏంటిఏమనుకుంటున్నారు ఎన్నికల గురించిఏపీలో ఫలితాలెలా ఉంటాయో?’ అని మాట కదిపారు. ద్రోణంరాజు సత్యనారాయణబాగారెడ్డి వంటి సీనియర్లతో సహా పలువురున్నారక్కడ. బాగుంది, 135 నుంచి 145 వరకు వస్తాయేమో కాంగ్రెస్‌కు’ అని బదులిచ్చారు. ఏంటిప్రస్తుతం ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి చెబుతున్నారాలేక ఏపీలోనేనా?’ అని వివరణ కోరారు. లేదుఏపీలోనే అంత సంఖ్య అనుకుంటున్నాం’ అని బదులిచ్చారు. అదే నాయకులు ఉండబట్టలేక, ‘పోనీమీరేమనుకుంటున్నారో చెప్పండి,’ అంటే, ‘30 వస్తే గొప్ప అనుకుంటున్నాను’ అని స్పందించారాయన. రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ 27 స్థానాలు కాంగ్రెస్‌ గెలిచిందప్పుడు.

జనాలదెంత మతిమరుపైనా....

విషయాలను అట్టే మరచిపోయే ప్రజల మతిమరుపే రాజకీయ పార్టీలకు ప్రాణవాయువవుతోంది. ప్రజలకు ఎంతగా మరచిపోయే తత్వం ఉన్నా.... డిజిటల్‌ మీడియా శకంలోపలు సామాజిక మాధ్యమ వేధికలున్న ఈ కాలంలో తాము ఏదైనా మాట్లాడేయొచ్చుమరచిపోవచ్చు అనుకునే నాయకుల ధీమానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదుగో మీరు అప్పుడలా అన్నారుఇప్పుడిలా అ(ంటు)న్నారు’ అనిపరస్పర విరుద్దంగా ఉండే రెండు వీడియో క్లిప్పులను పక్కపక్కన పెట్టి ఎత్తిపొడచినా సిగ్గుపడని బడా నాయకులెందరో! బీఆర్‌ఎస్‌ కు 12 దాకా సీట్లు వస్తాయనితాను ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నానని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేతమాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారోఆయనకే బోధపడుతున్నట్టు లేదు. తాను సీఎం పదవి రేసులో ఉన్నాననే ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్‌ కుప్రధాని పదవి రేసులో ఉన్నానంటున్న కేసీఆర్‌కు తేడా లేనట్టేనాఅని జనం ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలప్పుడుపోలింగ్‌ ముగిసి తెల్లవారితే`డిసెంబరు 3న ఫలితాల కోసం నిరీక్షిస్తుంటే,,,,  ‘ఫలానా 6వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంటుంది’ అని ఎంత నమ్మకంఆత్మవిశ్వాసం ఉంటే ప్రకటించాలికానీప్రజాతీర్పు పూర్తి భిన్నంగా వచ్చినపుడు హూందాగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేసిన రాజకీయ సంస్కృతి కూడా కాదు. ఇక ఆయన వాడని భాషపరుషపదాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం నోటీసిచ్చిన విషయం తెలిసిందే! ఆ మాటకొస్తే... తెలంగాణ ముఖ్యమంత్రిపీసీసీ నేత రేవంత్‌రెడ్డి వాడే భాష పట్ల కూడా ప్రత్యర్థిపార్టీలకు అభ్యంతరాలున్నాయి. బండబూతులు తిడితే క్లిక్‌ అవుతాము’ అనే భావనేదో ఆయనకు ఉన్నట్టుంది. గాడిదగుడ్డు’ ప్రచారమొక వ్యూహపరమైన ఎత్తుగడగా పరిగణిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాత మహబూబ్‌నగర్‌(అక్కడ అభ్యర్థి కూడా)కే చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు మధ్య మాటల యుద్ధం జుగుప్సాకరమైన స్థితికి వెళ్లింది.ఇలాంటివిపలువురు సీనియర్‌ నాయకుల మధ్య ఇంకా చాలా ఉన్నాయి.

ఇంతకీ ఎవరి అవకాశాలెంత?

తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌బీజేపీబీఆర్‌ఎస్‌ లకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగానే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌అయిదు నెలల తమ ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నిక ఫలితాలు ప్రజాతీర్పు (రెఫరండమ్‌) అని చెబుతోంది. సీఎం రేవంత్‌రెడ్డితో సహా పలువురు నాయకులు ఈ మాట అంటున్నారు. వారు చెబుతున్నట్టు పదమూడోపద్నాలుగో కాకపోయినా... బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు గెలవటం ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న సవాల్‌. ఖమ్మంనల్గండభువనగిరినాగరకర్నూల్‌మహబూబాబాద్‌వరంగల్‌పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్‌కు బలమైన విజయావకాశాలున్నాయి. మెదక్‌మహబూబ్‌నగర్‌ లో బీజేపీతో గట్టి ముఖాముఖి పోటీ ఉంది. ఆదిలాబాద్‌జహీరాబాద్‌ ల్లోని ముక్కోణపు పోటీల్లో కాంగ్రెస్‌ ఒక పక్షంగా ఉంది. ఇకదక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించిన బీజేపీకి తెలంగాణపై ఎక్కువ ఆశలే ఉన్నాయి. ఈ సారి ఆధిపత్యం కోసంఉత్తరాది`పశ్చిమాన కోల్పోతున్న సంఖ్యను భర్తీ చేసుకునే అధిక స్థానాలు దక్షిణాది`తూర్పు భారతం నుంచి రాబట్టుకోవాలని పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎలాగైనా ఇక్కడ రెండంకెల స్థానాలు గెలుచుకోవాలన్నది వారి లక్ష్యంగా ఉంది. బీజేపీ కి కరీంనగర్‌సికింద్రాబాద్‌నిజామాబాద్‌చేవెళ్లమల్కాజిగిరి స్థానాల్లో గట్టి విజయావకాశాలున్నాయి. కాంగ్రెస్‌తో నువ్వా`నేనా అన్నట్టు గట్టి ముఖాముఖి పోటీలో ఉన్న మహబూబ్‌నగర్‌మెదక్‌ లకు తోడు ముక్కోణపు పోటీ ఉన్న ఆదిలాబాద్‌జహీరాబాద్‌లలోనూ గట్టి పోటీ దారుగానే ఉంది. పుష్కరకాలానికి పైగా ఉద్యమపార్టీగా ఉండిరాష్ట్రం ఏర్పడ్డ నుంచి పాలకపక్షమైన భారత్‌ రాష్ట్ర సమితికి ఈ ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిడస్సిపోయి ఉన్న బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో ఎన్నో కొన్ని స్థానాలు గెలవాల్సిన రాజకీయ అవసరం ఉంది. అనూహ్య ఫలితం వస్తే ఆదిలాబాద్‌జహీరాబాద్‌మెదక్‌ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచేందుకు అవకాశాలుంటాయని క్షేత్రస్థాయి సమాచారం. 

 

 

  - దిలీప్‌ రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌,

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

Mail: dileepreddy.ic@gmail.com,
Cell No: 9949099802