పిడుగుపాటుకు గురై రైతు మృతి

Farmer dies due to lightning

Jun 6, 2024 - 17:51
 0
పిడుగుపాటుకు గురై రైతు మృతి

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కాల్వకు చెందిన యువ రైతు ప్రవీణ్ (28) పిడుగుపాటు కు గురై గురువారం మృతి చెందాడు. సాకుకు సంబంధించిన పనులను చూసుకునేందుకు తన పంటచేనులోకి వెళ్లాడు. అదే సమయంలో ఆకాశం మేఘావృతం కావడం పిడుగు పడడంతో ప్రవీణ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్యతోపాటు ఏడాది వయస్సుకన్న కూతురు ఉంది.