చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్
పది రాష్ట్రాల్లోని 96 స్థానాలపై ఓటింగ్ ఉదయం 11 గంటల వరకు 24.87శాతం నమోదైంది. పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పది రాష్ట్రాల్లోని 96 స్థానాలపై ఓటింగ్ ఉదయం 11 గంటల వరకు 24.87శాతం నమోదైంది. పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది.
పోలింగ్ శాతం..
నాలుగో దశ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం. ఆంధ్రప్రదేశ్ 22.54 శాతం, బీహార్ 22.54, జమ్మూ కాశ్మీర్ 14.94, జార్ఖండ్ 27.40, మధ్యప్రదేశ్ 32.38, మహారాష్ట్ర 17.51, ఒడిశా 23.28, తెలంగాణ 24.31, ఉత్తర ప్రదేశ్ 27.12, పశ్చిమ బెంగాల్ 32.78 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటరుపై ఎమ్మెల్యే దాడి.. ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన ఓటరు!
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓటరుపై వైఎస్సార్పీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప దెబ్బ కొట్టాడు. ఎమ్మెల్యే క్యూలైన్ లో రాకపోవడంతో ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఓటరును చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే ఓటరు కూడా తన చెప్పుతీసి ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డాడు.పక్కనే ఉన్న అనుచరులు ఓటరుపై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు.
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కార్యకర్త హత్య ఉద్రిక్తత..
పశ్చిమ బెంగాల్‌లోని బోల్‌పూర్‌లో ఓటు వేయడానికి ఒక రోజు ముందు అర్థరాత్రి టీఎంసీ కార్యకర్త హత్యకు గురవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాంబు పేలుళ్లకు సీపీఐ (ఎం) మద్దతుదారులే కారణమని టీఎంసీ ఆరోపించింది. దుర్గాపూర్‌లో బీజేపీ, టీఎంసీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. బీర్భూమ్‌లో, టిఎంసి మద్దతుదారులు తమ స్టాల్‌ను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది.
స్లిప్పులు రాలేదని భద్రతా సిబ్బందిపై రాళ్లదాడి..
మరోవైపు బీహార్‌లోని ముంగేర్‌లో ఓటింగ్‌కు ముందు ఓ పోలింగ్ ఏజెంట్ గుండెపోటుతో మృతి చెందాడు. ముంగేర్ లోనే ఓటింగ్ సమయంలో స్లిప్పులు ఇవ్వనందుకు కొందరు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలో జర్నలిస్ట్ మృతి..
మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ ఎన్నికలను కవర్ చేయడానికి ముంబై నుంచి అంబజోగై పట్టణానికి వచ్చిన ఓ జర్నలిస్ట్ గుండెపోటుతో మరణించాడు. అతన్ని వైభవ్ కల్ గుట్కర్ గా పోలీసులు గుర్తించారు. సోమవారం పోలింగ్ సందర్భంగా విధులు నిర్వహించేందుకు వచ్చాడు. కానీ అనారోగ్యం కారణంతో కారులో కూర్చొని గుండెపోటుతో మృతి చెందాడు. వైభవ్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
కన్హయ్య కుమార్ బెగుసరాయ్‌లో ఓటు..
కాంగ్రెస్ నాయకుడు, ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ బెగుసరాయ్‌లో ఓటు వేశారు.