10 మందిపై బైండోవర్ కేసు నమోదు
Bindover case registered against 10 people
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదిమంది వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. పేకాట కేసుల్లో ఉన్న 10 మందిని మందమర్రి తహసీల్దా ర్ సతీష్ కుమార్ ఎదుట హాజరుపరుచుగా వారిపై బైండోవర్ కేసులను నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. బైండోవర్ కేసుల నిందితులను పట్టుకోవడంలో డబ్ల్యూఏఎస్సై రజిత, హెడ్ కానిస్టేబుల్ రాజమౌళిలు ప్రదాన పాత్ర పోషించారు.