అడ్డగోలు ఫీజులపై చర్యలేవి?
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు రవికుమార్ మాదిగ
నా తెలంగాణ, షాద్ నగర్: ప్రైవేట్ స్కూళ్ల అడ్డగోలు ఫీజులను నియంత్రించలేక విద్యాశాఖాధికారులు చేతులెత్తేశారని షాద్ నగర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పెంటనోళ్ల రవికుమార్ మాదిగ ఆరోపించారు. శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపీడీపై ప్రకటన విడుదల చేశారు. డొనేషన్లు, అడ్మిషన్లు, స్టేషనరీ పేరు చెబుతూ విద్యను వ్యాపారంగా మార్చారని మండిపడ్డారు. నిరుపేదలను దోచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీపై పలుమార్లు విద్యాశాఖాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా షాద్ నగర్ లోని ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై అధికారులు దృష్టి సారించాలని రవికుమార్ మాదిగ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.