మెడికో హత్య ఏబీవీపీ ఆందోళన
Medico killing is ABVP's concern
నా తెలంగాణ, సంగారెడ్డి : కోల్ కతా మెడికో హత్యకు గురైన నిందితులను వెంటనే ఉరితీయాలని ఏబీవీపీ మెదక్ కార్యదర్శి బోడ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించి బెంగాల్ సీఎం దిష్ఠిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. అత్యాచారం, హత్య ఎంతో బాధకరమన్నారు. బెంగాల్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని. దుండగులు, రౌడీలు మహిళలపై రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వ అండ లభించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి మహేష్, వెంకట్, దినేష్, శంక్, నిఖిల్, భారతి, విద్యార్థినిలు ఉన్నారు.